# Tags
#తెలంగాణ

మంథని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాద దంపతుల వర్దంతి, నివాళులు

న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి లు దారుణ హత్యకు గురై నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నందున దోషులను శిక్షించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నందున మంథని బార్ అసోసియేషన్ అద్యక్షులు KVLN హరి బాబు ఆవేదన వక్తం చేశారు.

మంథని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాద దంపతుల వర్దంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ, న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం కారణంగా రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి చట్టం తీసుకురావలసిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమములో బార్ అసోసియేషన్ ఉపాద్యక్షులు K. రాగోత్తమ్ రెడ్డి, కార్యదర్శి ముస్కుల సహేందర్ రెడ్డి న్యాయవాదులు సువర్ణ చంద్రశేఖర్, S. భాస్కర్ రెడ్డి, చంద్రుపట్ల రమణకుమార్ రెడ్డి, బొట్ల ఆంజనేయులు, శశి భూషణ్ కాచే, ఆర్ల నాగరాజు, దహగమ్ శ్రీనాథ్, బక్కతట్ల సతీష్, భాగ్యలక్ష్మి, రాచర్ల రాజేందర్, K. వ్యాస్ కుమార్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *