# Tags

రోటరీ,ఆపి, రెడ్ క్రాస్ లాంటి సంస్థలందిస్తున్న వైద్య శిభిరాలు ప్రజలకెంతో ఉపయోగకరం :ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జగిత్యాల నియోజకవర్గం రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ :

ప్రభుత్వం పెద్దన్నలా వ్యవహరిస్తుండగా, రోటరీ,ఆపి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లాంటి స్వచ్ఛందసంస్థలందిస్తున్న వైద్య శిభిరాలు ప్రజలకెంతగానో ఉపయోగపడుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.

రాయికల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒమేగా సుశ్రుత హాస్పిటల్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్, ఆపి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని శుక్రవారం  ఉదయం 11-30 గంటల ప్రాంతంలో ప్రారంభించి,పరీక్షల సరళిని జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ పరిశీలించారు. 

ఈ ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరంలో సుమారు 100 మందికిపైగా మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోగా, 9 మందికి మామోగ్రఫీ పరీక్షలు, నలుగురికి ఎక్స్-రే పరీక్షలు, ఇద్దరు మహిళలకు పాప్ స్మెర్ పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ…రోగం వచ్చాక చికిత్స కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం,ముందస్తు పరీక్షలు ఉత్తమం అన్నారు. ప్రజలు రోజు వారీ జీవన విధానం,వ్యాయామం, వాకింగ్ ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు. మూఢనమ్మకాలు నమ్మవద్దనీ,  సైన్స్ ను నమ్మి ముందస్తు చికిత్స ద్వారా క్యాన్సర్ నివారణ సాధ్యం అన్నారు.. ప్లాస్టిక్ వాడకం తగ్గించడం ద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు. ప్రధానంగా మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటేనే, సమాజం, కుటుంభం బాగుంటుందన్నారు.

కాగా, 4 దశాబ్దాలుగా రోటరీ క్లబ్ సేవలు అందిస్తుందన్నారు. జగిత్యాల పట్టణంలో మొదటి పార్కు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోలియో నివారణలో రోటరీ క్లబ్ క్రియాశీలక పాత్ర వహించిందని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఒమేగా హాస్పిటల్ వైద్యులు, కాన్సర్ వ్యాధి నిపుణులు డా.అమర్ నాథ్, డా. సుప్రీత్ రెడ్డి(ఎం.బి.బి.ఎస్), మార్కెటింగ్అధికారులు రాజేందర్, వరుణ్,  మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు,మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుత రావు, రోటరీ క్లబ్ అధ్యక్షులు చారి, రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్,టివి సూర్యం,ఎంపీడీఓ చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ మనోహర్,తహసీల్దార్ నాగార్జున,సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, రాయికల్ హాస్పిటల్ సూపరిండెంట్ డా. శశికాంత్ రెడ్డి, డా. ఒడ్నాల రజిత, డా.రంగనాథ్, కోల శ్రీనివాస్ ,రవీందర్ రావు, మాజీ AMC ఛైర్మెన్ గన్నె రాజిరెడ్డి, నాయకులు, ప్రజలు,తదితరులు, పాల్గొన్నారు.