# Tags
#తెలంగాణ

వైద్య సిబ్బంది ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించాలి : జిల్లా వైద్యాధికారి రజిత

( తెలంగాణ రిపోర్టర్):-

జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చీర్లవంచ లోని బస్వాపూర్ మరియు ఇల్లంతకుంట మండలములోని పెద్దలింగాపూర్ గ్రామాలని జ్వరాల నియంత్రణలో భాగముగా తనిఖి నిర్వహించి రికార్డులను పరిశీలించి ఆరోగ్య కార్యక్రమాలపై మరియు కాలానుగుణ వ్యాదుల పై ఆరోగ్య సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సమీక్షా సమావేశంలో వైద్య సిబ్బంది ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించడం, అనుమానిత జ్వర పిడితులను గుర్తించి వారి నుండి రక్త నమూనాలను సేకరించి ఎలిసా పరీక్షా ద్వారా వ్యాధి నిర్దారణ చేసి చికిత్స అందిచడముతో పాటుగా రోజువారీ అబేట్ స్ప్రే మరియు ఆయిల్ బాల్స్ నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో వేయడం, ప్రజలు డెంగ్యు జ్వరాల బారిన పడకుండా వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుబ్రత పాటించాలని సూచించారు.

పరిసర పరిసరాలలో వర్షపు నీరు, చెత్త నిల్వ ఉంచకుండా చూసుకోవాలని డెంగ్యు వ్యాది విషయములో భయం వద్దని జాగ్రత్తలు పాటించాలని జాగ్రత్తలతోనే కాలానుగుణ వ్యాదులను అరికట్టవచ్చు అని తెలియపరుస్తూ అవగాహనా కల్పించడం జరిగినది.
ఈ కార్యక్రమములో జిల్లా ప్రోగ్రాం అధికారులు డా.సంపత్ కుమార్, డా.రామకృష్ణ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.