# Tags
#Blog

రాయికల్ పట్టణంలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు మెగా జాబ్ మేళా

రాయికల్:

పట్టణంలోని ఒక  ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 10-30 నుండి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన  mnc కంపెనీ, ఏనుగు దయానంద రెడ్డి వసంత టూల్స్ క్రాఫ్ట్ కంపెనీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు మెగా జాబ్ మేళా నిర్వహించారు.

పలు గ్రామాల నుంచి సుమారు 50 మంది మహిళ అభ్యర్థులు పాల్గొనగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారు.. ఎంపికైన వారికి వేతనంతో పాటు ఉచిత వసతి రవాణా ఉంటుందని ప్రతి నిధులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు యువంగ్ చెయిన్ (నిక్), వీరా,ముఖ్య అతిథి మాజీ మున్సిపల్ చైర్మన్  మోర హన్మాండ్లు, నిర్వాహకులు ,తుమ్మల సదాశివరెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ బాలే శేఖర్,నాయకులు గండ్ర అచ్యుతరావు,తోపారపు రవి, వీరబత్తిని శంకర్, ఎలిగేటి రామకృష్ణ, బాలే నిఖిల్ , తదితరులు ఉన్నారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ dr . తురగ రాజారెడ్డి… గ్రామీణ యువత ఉపాధి అవకాశాలు వినియోగించుకోవాలని  అన్నారు..