పోలీసు శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ : 1107 మంది యువతకు నియామకపత్రాలు అందజేత
జగిత్యాల జిల్లా….
యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్
* 3200 మంది పైగా నిరుద్యోగ యువతి యువకులు హాజరు
* ఉద్యోగాలకు ఎంపిక అయన 1107 యువతకు నియామక పత్రాలు అందజేత
వృత్తి నైపుణ్యం (స్కిల్ డెవలప్‌మెంట్) పెంచుకుని స్వయం ఉపాధివైపు యువతను తీసుకువెళ్లాలన్న లక్ష్యంతోనే జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో THREDZ IT గ్రూమింగ్ ఎక్సలెన్స్ వారి సహకారంతో జిల్లా కేంద్రంలోని AR ఫంక్షన్ హాల్ నందు నిరుద్యోగ యువతకై నిర్వహించిన మెగా జాబ్‌మేళాను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉదయం 11 గంటల నుండి ప్రారంభమైన ఈ మెగా జాబ్‌మేళాకు ముందుగా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న 3200 మ౦ది యువత పెద్ద సంఖ్యలో ఈ మేళాకు తరలిరాగా 58 వివిధ కంపెనీలకు చెందిన హెచ్.ఆర్‌లు వచ్చిన యువతకు సంబంధించి విద్యార్హతలను బట్టి ఇంటర్యూలు నిర్వహించిన అనంతరం… తమ తమ సంస్థల్లో పనిచేసేందుకు ఎంపిక చేసిన 1107 మందికి నియామక పత్రాలను అశోక్ కుమార్ చేతులమీదుగా అందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ…. యువత తలుచుకుంటే సాధించాలేనిదంటూ ఏదీ లేదు అన్నారు.. యువతీ యువకులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉద్యోగాలు చేసుకొని కుటుంబానికి అండగా నిలబడాలని సూచించారు.
చదువు అనేది ఉద్యోగానికి, పేదరికం అడ్డురాదని పేర్కొన్నారు. అత్యున్నత స్థాయిలో ఉన్న ఎంతో మంది వ్యక్తులు పేదరికాన్ని జయించిన వారే అన్నారు. మనకు నచ్చిన వృత్తి నైపుణ్యం ఉన్నా రంగాల్లో ఉద్యోగాలు చేయడం చాలా ఉత్తమమని అన్నారు. జీతం ఎంత వస్తుంది అనే అంశం పైన డిసిషన్ ఉండకూడదని మనకు నచ్చినా,వృత్తి నైపుణ్యం ఉన్నా రంగాల్లో మాత్రమే ఎంపిక చేసుకోవాలని అన్నారు.
జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత మిగతావన్నీ వాటంతట అవే మన దగ్గరకు వస్తాయని అభిప్రాయపడ్డారు.
ప్రతి ఒక్కరికీ ఉద్యోగం చేయాలనే తాపత్రయం ఉంటుంది కానీ ఏ ఉద్యోగం చేయాలని ఎవరు నమ్మాలో తెలియక చాలామంది మోసపోతుంటారు అని ఎవరైనా డబ్బులకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పితే నమ్మవద్దని తెలిపారు.
నిరుద్యోగ యువత గల్ఫ్ దేశాలకు వెళ్లాలి అనుకున్నప్పుడు సంబంధిత ఏజెంట్ ద్వారా ఆ యొక్క ఉద్యోగం గురించి చి పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాతనే ఆ యొక్క ఏజెంటుకు డబ్బులు ఇవ్వాలని మరియు ఆ యొక్క ఏజెంటు ప్రభుత్వం నుండి ఆమోదం పొందిన వ్యక్తి అవునా కాదా అని తెలుసు కోవాలని అన్నారు.
ఈ జాబ్ మేళాను విజయవంతం చేయడంలో కృషి చేసిన డిఎస్పీలు ఆయా సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్సై లకు, సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలియజేశారు.
https://public.app/video/sp_klgc8b0nqyk86?utm_medium=android&utm_source=share: పోలీసు శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ : 1107 మంది యువతకు నియామకపత్రాలు అందజేతఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీ లు రఘుచందర్, సి.ఐ లు రాంనరసింహారెడ్డి, వేణుగోపాల్,రవి,కృష్ణారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్,రామకృష్ణ, వేణు మరియు ఎస్. ఐ లు, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.