# Tags
#తెలంగాణ #జగిత్యాల

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిసిన జగిత్యాల పట్టణ ఎంఐఎం పార్టీ నాయకులు..

జగిత్యాల

ఫిబ్రవరి 14వ తేదీన రాత్రి షబ్ భరత్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో ఖబరస్తాన్ లలో పారిశుధ్య పనులను చేపట్టాలని ,ఉస్మాన్ పుర ఖబరస్తాన్ వద్ద ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ ను వేరే చోటికి మార్చాలని కోరుతూ జగిత్యాల పట్టణ MIM పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.

ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారుల దృష్టి కి తీసుకెళ్లి అవసరమైన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ MIM అధ్యక్షులు మహమ్మద్ యూనస్ నదీం,పార్టీ నాయకు లు తదితరులు పాల్గొన్నారు.