#తెలంగాణ #హైదరాబాద్

శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో రఘువంశీ ఏరోస్పేస్ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు శంఖుస్థాపన

శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో రఘువంశీ ఏరోస్పేస్ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా…రఘువంశీ ఏరోస్పేస్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

రూ.300 కోట్లతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ కర్మాగారం రానున్న మూడేళ్లలో 1200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

రెండు వేల కోట్ల విలువైన ఆర్డర్‌లకు సంబంధించిన పరికరాలను ఈ కొత్త సదుపాయంలో తయారు చేయనున్నారని వివరించారు.

రఘు వంశీ ఏరోస్పేస్….ఎయిర్‌బస్ A320 మరియు బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్లు, GE ఏరోస్పేస్, రోల్స్ రాయిస్, ప్రాట్ & విట్నీ, సఫ్రాన్ మరియు హనీవెల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ తయారీదారులకు కీలక భాగాలను సరఫరా చేయనున్నారని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *