# Tags
#తెలంగాణ

క్రైస్తవ మందిరాలలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్రైస్తవ సోదరీ, సోదరులతో కలిసి శుభాకాంక్షలు

మంథని :  

బుధవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎరుకలగూడెం బేతేలు గాస్పెల్ ప్రేయర్ మినిస్ట్రీస్ చర్చిమరియు సియేను ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకల్లో…రాష్ట్ర ఐటి,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్రైస్తవ సోదరీ, సోదరులతో కలిసి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.  

అలాగే, మంథని పట్టణంలోని క్రైస్తవ మందిరాలలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ..ఏ మతస్థులు వారి దైవాలను, గురువులను పూజిస్తారని ఎవరు ఎవరిని పూజించినా, అందరూ పాటించేది ఒకటే ఓర్పు, సహనం అనీ,  అదేవిధంగా పదిమందికి మేలు చేయాలని ప్రతి ఒక్కరి పట్ల ఓపికతో ఉండాలని పిలుపునిచ్చారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం త్వరలో ప్రారంభించబోతున్నామని, క్రైస్తవులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.