# Tags

ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి : మంత్రి శ్రీధర్ బాబు 

పెద్దపల్లిలో :  

ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలనీ, పట్టణంను మరింత అభివృద్ధి చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి ప్రజలను కోరారు.

మున్సిపల్ ఎన్నికల సందర్బంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గోల్డెన్ తులిప్ బ్యాంకెట్ హాల్ల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు …పెద్దపల్లి శాసనసభ్యులు  “ విజయరమణ రావుతో కలిసి మాట్లాడారు. 

ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… పట్టణంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నారు.ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఓటేసి మున్సిపల్ లో గెలిస్తే పట్టణం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.

బి.ఆర్.ఎస్ హయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్చిన్నం చేసిన కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని గాడిలో పెట్టి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం అన్నారు. 

బి.ఆర్.ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో పట్టణాలను, పల్లెలను గాలికొదిలేసారు అని అన్నారు. ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు అని, ఎన్నికలు వస్తె అడ్డగోలుగా మాటలు చెప్పే పార్టీ బి.ఆర్.ఎస్ పార్టీ అన్నారు. 

అలాగే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి పెద్దపల్లి జిల్లాకు నిధులు కేటాయించలేదని పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాం అని అన్నారు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గత బి.ఆర్.ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూమ్ లను అరకొరగా కట్టి, లబ్ధిదారులకు అందించలేదని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత డబుల్ బెడ్ రూం లకు మౌలిక సదుపాయాలు కల్పించి అందించిన ఘనత ఎమ్మెల్యే విజయరమణ రావుదే అని అన్నారు. 

అలాగే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *