# Tags
#తెలంగాణ

శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్  బాబు

ధర్మపురి 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్రచారంలో భాగంగా శుక్రవారం ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘంలో పట్టభద్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంలో ఆలయానికి చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబుకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు, వేదం పండితులు ఆశీర్వచనములందించి, తీర్థ ప్రసాదములందజేశారు.