# Tags
#తెలంగాణ

మంత్రపురి పురవీధుల్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన, సమస్యలపై ఆరా!

మంథని : (మంత్రపురి)

మంథని పట్టణంలోని పురవీధుల్లో పర్యటించి,వార్డ్ సమస్యలను తెలుసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంత్రపురి పట్టణం బుధవారం ఉదయం తెల్లవారుజామున పురవీధుల్లో సందడే సందడి…మంత్రపురి (మంథని) పట్టణంలోని ఆయా అవార్డుల్లో ప్రజలు సందడి ఏమిటా అని చూస్తుంటే… కాలినడకన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కనిపించడంతో… వివిధ వార్డుల ప్రజలు తమ తమ సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు కదిలారు.

ఆయా వార్డుల్లో,  పురవీధుల్లో కాలినడకన పర్యటిస్తూనే,  పారిశుధ్యంపై అధికారులతో నడుస్తూనే చర్చించారు. మరోవైపు ప్రజలు, మహిళలు వారి వారి సమస్యలపై ఏకరు పెట్టుకుంటుంటే, వాటి పరిష్కారం కోసం అధికారులను అప్పటికప్పుడే పురమాయిస్తున్నారు.

రాష్ట్రానికి మంత్రి అయినా ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని నమ్ముకున్న శ్రీధర్ బాబు తమ నియోజకవర్గ ప్రజలను సమస్యలను పక్కన పెట్టకుండా, మంత్రపురి అభివృద్ధి పట్ల శ్రధ్దతో ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశలో ముందుకు సాగుతున్న క్రమంలో…..

ఎంతగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ… మంత్రపురి పురవీధుల్లో కాలినడక పర్యటిస్తూ, సమస్యలు పరిష్కరిస్తూ పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.