# Tags

తుంగూర్ సర్పంచ్ అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

తుంగూర్ సర్పంచ్ గా రెండో మారు గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

తుంగూర్ సర్పంచ్ గా రెండో మారు గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు.

జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు.

పొన్నాల గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలుపొందిన రాజగోపాల్ రావు ను తోటి పాలకవర్గంను సన్మానం చేసి, గ్రామాల అభివృద్ధి కి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్బంగా, కార్యక్రమం అనంతరం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిసిల్ల శ్రీనివాస్ మరియు పంచాయతీరాజ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు జనగామ నాగరాజు సర్పంచ్ రాజగోపాల్ రావు ను శాలువా తో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.