# Tags
#తెలంగాణ

పాత్రికేయుడు పాకాల రవీందర్ రెడ్డి కుటుంబానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శ

హుజురాబాద్ :

పట్టణంలోని కాకతీయకాలనీకి చెందిన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకుడు, పాత్రికేయుడు పాకాల రవీందర్ రెడ్డి మాతృమూర్తి పాకాల మాణిక్యమ్మ ఇటీవల మృతిచెందారు.

ఈసందర్భంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రవీందర్ రెడ్డినీ,అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు.