# Tags
#తెలంగాణ

స్వగ్రామానికి చేరుకొని కంటతడి పెట్టిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

* భార్యను గుర్తు చేసుకుంటూ శోక సంద్రంలో మునిగిన ఎమ్మెల్యే – ఓదార్చిన గ్రామస్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా:సంపత్ panja
ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామానికి చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీ వియోగం తర్వాత మొట్టమొదటిసారిగా నేడు తన స్వగ్రామమైన కోరుట్ల పేటకు చేరుకొని తన జీవిత భాగస్వామి జీవితాంతం తోడుంటానని అడుగులో అడుగు వేసి అకస్మాత్తుగా బలవన్మానవానికి పాల్పడిన భార్యను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. గ్రామస్తులు మిత్రులు కుటుంబ సభ్యులు సత్యంను ఓదార్చారు అనంతరం బొప్పాపూర్ గ్రామానికి చెందిన తోటి మిత్రుడు ముత్యాల సత్యం రెడ్డి ఇంటి వద్ద కాసేపు తన భావోద్వేగాన్ని మిత్రులతో పంచుకొని తన లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని తెలిపారు అనంతరం చొప్పదండి నియోజకవర్గానికి బయలుదేరారు మిత్రులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మేడిపల్లి సత్యమును ఓదార్చారు.