#Blog

అభివృద్ధికి అడ్డుగోడలా ఎమ్మెల్యే నిలుస్తున్నారు:కామారెడ్డి డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ఆరోపణ

కామారెడ్డి, (తెలంగాణ రిపోర్టర్):

అభివృద్ధికి అడ్డుగోడలా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నిలుస్తున్నారని కామారెడ్డి డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ఆరోపించారు.పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం లో మాట్లాడుతూ…అన్ని వసతులు ఉన్న కామారెడ్డి నియోజకవర్గానికి రావలసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జుక్కల్ కి తరలి వెళ్ళిపోయిందని,రాష్ట్రంలో 13 నర్సింగ్ కాలేజీలు రాగా కామారెడ్డికి ఎమ్మెల్యే వైఖరి వల్ల రాలేదు అని విమర్శలు చేశారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎంతో కష్టపడి కామారెడ్డి అభివృద్ధికి నిధులు తీసుకువస్తే దానిపై కూడా విజిలెన్స్ వారికి ఫిర్యాదులు చేసి తెచ్చిన అభివృద్ధి పనులను అడ్డుకోవడం విచారకరమన్నారు.నిజామాబాద్ ఆర్మూర్ లో గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలతో కలిసి అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నారని…ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించినా అని శాడిస్ట్ చేష్టల వల్ల, కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులు కూడా విసిగి, వేసారి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారని, సెలవులపై వెళ్ళిపోతున్నారని ఆరోపించారు. దీంతో కొత్తగా ఎవరైన అధికారులు రావడానికి కూడా జంకుతున్నారని ఆరోపించారు.
టీవీ ఇంటర్వ్యూలలో మైకులు పట్టుకుని అవినీతి రహిత పాలన అందించడమే నా లక్ష్యం అని ఉపన్యాసం దంచే ఎమ్మెల్యే… డిగ్రీ కాలేజీ భూములలో అవినీతిచేసి అన్యక్రాంతం చేశారని ఆరోపించారు.వాటిని అరోరా కాలేజీ వారికి అప్పనంగా 26 ఎకరాలు అందించారని, దానిపై వారు 17 కోట్ల రూ. అప్పు చేశారని ఆరోపించారు. వాళ్లు దోచింది ఎంత మీకు ఇచ్చింది ఎంత? అని ప్రశ్నించారు. కాలేజీ భూముల అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అన్నారు. మిమ్మల్ని గెలిపించిన కామారెడ్డి ప్రజలు బాధపడుతున్నారని రేవంత్ రెడ్డి ని గెలిపించుకుంటే రాష్ట్రంలోనే కామారెడ్డి అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంటుండే అని ఆవేదన వ్యక్తం చేసారు.మీ సొంత నిధులు 150 కోట్లతో అభివృద్ధి చేస్తానని అబద్ధపు ప్రచారాలు చేసి గెలిచి కామారెడ్డి ప్రజలను నట్టేట ముంచినవని అన్నారు.గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న CMRF చెక్కులను షబ్బీర్ అలీ ఎంతో కష్టపడి 300 చెక్కులు మంజూరు చేయిస్తే ప్రోటోకాల్ ప్రకారం చెక్కులు నేనే పంచుతా అని సీఎం ఆఫీసులో ధర్నాకు కూర్చున్నావు అని అన్నారు.మా నాయకుడు పెద్దమనసు చేసుకొని చెక్కులు ఎవరు పంచితే ఏమి నియోజకవర్గ ప్రజలకు మేలు జరగాలని అన్నారు అని గుర్తు చేసారు.కామారెడ్డి ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో బిజెపికి ఆధిక్యం ఇచ్చారు. విద్యాసంస్థలు, సాగునీరు, తాగునీరు,
ఇండస్ట్రీలు, ప్రాజెక్టులు కామారెడ్డికి రావాలంటే ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితులు మన ప్రియతమ నాయకుడు షబ్బీర్ అలీ ద్వారానే సాధ్యం అని,
కామారెడ్డి మేధావులారా! విద్యార్థులారా! నాయకులారా! ప్రజలారా! ఇప్పటికైనా ఆలోచించండి… ఈరోజు ప్రోటోకాల్ కావాలా అభివృద్ధి కావాలా అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో మా సత్తా ఏంటో చాటుతాం,
మీ సొంత నిధులతో చేస్తానన్న అభివృద్ధి ప్రజలే నిన్ను నిలదీసి గ్రామంలో రాకుండా అడ్డుకునే రోజులు దగ్గరపడ్డాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ చంద్ర కాంత్ రెడ్డి,పండ్లరాజు,భీమ్ రెడ్డి,కారంగుల అశోక్ రెడ్డి,గాల్ రెడ్డి, మోహన్ రెడ్డి,గోనె శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు. గూడెం శ్రీనివాస్ రెడ్డి. యాదవ రెడ్డి. నాసిలాల్ నాయక్. గుడుగులశ్రీనివాస్. సుతారి రమేష్ . పల్లె రమేష్ గౌడ్ అనంతరెడ్డి.. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి. కౌన్సిలర్ సలీం. అంజద్. పాత శివ కృష్ణమూర్తి. జూలూరి సుధాకర్. సుదర్శన్. తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *