# Tags
#తెలంగాణ #జగిత్యాల

క్రీడల అభివృద్దికి కృషిఎమ్మెల్సీ జీవన్ రెడ్డి


రాయికల్ : S. Shyamsunder

క్రీడల అభివృద్దికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని ఆయన ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్దికి కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. బడ్జెట్లో క్రీడలకు ఎక్కువ నిధులను కెటాయించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

గ్రామీణ క్రీడలు, క్రీడాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అత్తినేని గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Elementor #84605