# Tags
#తెలంగాణ #జగిత్యాల

సారంగపూర్ కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జగిత్యాల :

జిల్లాలోని సారంగపూర్  కస్తూర్బా పాఠశాలను ఆదివారం మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత విద్యార్థులతో మాట్లాడుతూ, సౌకర్యాలు, తదితర అంశాలపై మాట్లాడారు. పెంచిన డైట్ చార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింపజేయకపోవడం బాధాకరం అన్నారు.

కస్తూర్బా పాఠశాలలకు కూడా పెంచిన డైట్ చార్జీలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలున్నాయనీ,  విద్యార్థులు  అందరికీ పౌష్టికాహారం అందించాలన్నారు.

సర్వ శిక్ష అభియాన్ కింద పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారనీ,  ఈ ఉపాధ్యాయులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.కెసిఆర్ మొదలుపెట్టిన గురుకుల పాఠశాలల లక్ష్యాన్ని దెబ్బతీయకూడదనీ,  విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం రాజీ పడకూడదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.