# Tags

భారత దేశ సివిల్ లీగల్ ప్రొటెక్షన్ సర్వీసెస్ అధ్యక్షులు గా మహమ్మద్ లాల

(తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా,

రాచర్ల గొల్లపల్లి యువకుడు ప్రముఖ ,సేవా కార్యకర్త మహమ్మద్ లాలా, ను జిల్లా చైర్మన్గా CPLS, భారత అద్యక్షుడు ప్రకటించారు.
ఇలాంటి అరుదైన అవకాశం రాచర్ల గొల్లపల్లి, గ్రామము ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యక్తికి రావడం ఒక అరుదైన అవకాశం.


భారత CPLS ,సంస్థ గ్రామస్థాయిలో నుంచి మొదలుపెట్టి జిల్లా స్థాయి వరకు భారత రాజ్యాంగం యొక్క హక్కులను, బాధ్యతలను నిర్వహించడానికి ఏర్పడిన అధికారిక సంస్థ.
భారత CPLS, జిల్లా చైర్మన్గా మహమ్మద్ లాలా, సామాజిక సేవా కార్యకర్తకు లభించడం హర్షించదగ్గ విషయం.


ఇందు విషయంగా సి, పి ,ఎల్ ,ఎస్ , జిల్లా చైర్మన్ ఎండి లాల, మాట్లాడుతూ CPLS, (సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సంస్థ) యొక్క ఆశయాల కోసం మరియు భారత రాజ్యాంగం లో పొందుపరిచిన సాధారణమైన పౌరులందరికీ లభించవలసిన హక్కులు మాత్రమే కాకుండా, బాధ్యతలు కూడా కచ్చితంగా సక్రమంగా న్యాయంగా ధర్మంగా నిర్వహిస్తూ ప్రతిరోజు 24, గంటలు తన పదవీకాలం ముగిసే వరకు తన విధులు నిర్వహిస్తానని ఇందుకోసం ప్రజల కోసం సంస్థ తరఫున కావలసిన తన పోరాటాన్ని సి పి ఎల్ ఎస్ సంస్థ ఆశయ ల కోసం నిస్వార్ధంగా కట్టుబడి పని చేస్తానని తెలియజేశారు..