# Tags
#Blog

శ్రీ సత్యసాయి సేవా సమితి,జగిత్యాల” ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ తరగతులు

జగిత్యాల :

10వ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ తరగతులు & ఎక్సామ్ ప్యాడ్స్ పంపిణీ

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సుల చే సోమవారం “శ్రీ సత్యసాయి సేవా సమితి,జగిత్యాల” ఆధ్వర్యంలో తాటిపల్లి ZPHS స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు “మోటివేషనల్ తరగతులను” నిర్వహించారు.

ఇందులో భాగంగా గోల్ సెట్టింగ్ ఐడియాస్, సక్సెస్ మంత్ర, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎగ్జామ్స్ ప్రిపేరషన్, మోరల్ వాల్యూస్ తదితర అంశాలను చక్కని ఉదాహరణలతో విద్యార్థులకు వివరించి, 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

అనంతరం స్వామి వారి చిరు కానుక గా పిల్లలందరికీ *ఎక్సామ్ పాడ్స్, పెన్స్ బిస్కట్ పాకెట్స్*  అందజేశారు.

ఈ కార్యక్రమంలో సత్యసాయి సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ , చిటుమల్ల లక్ష్మీనారాయణ , వంగల లక్ష్మీనారాయణ , గూడూరు మురళీధర్ రావు గారు అలాగే పాఠశాల తరపున ఉపాధ్యాయులు లతీఫ్ , కూరగాయల చంద్రశేఖర్ , గంగారాం , సవిత , సునీత , దేవి , శ్రీకాంత్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *