జర్నలిస్టుల నిరసన దీక్షకు ఎంపి అర్వింద్ సంఘీభావం
జగిత్యాల పట్టణంలో జర్నలిస్టులు తమ ఇళ్ళ స్థలాల సాధనకై 12 రోజులుగా నిర్వహిస్తున్న నిరసన దీక్ష
-సంఘీభావం తెలిపిన ఎంపి అర్వింద్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ Dr. బోగ శ్రావణి తో కలిసి జర్నలిస్టుల నిరసన దీక్షా శిబిరానికి చేరుకుని, సంఘీభావం తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆయన వెంట పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనుమల కృష్ణ హరి, మరియు మండల అధ్యక్షులు, జిల్లా మరియు మండల పదాధికారులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దీక్షకు విచ్చేసి సంఘీభావం తెలిపిన అనంతరం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ….. తను రాజకీయల్లోకి వచ్చిన నాటి నుండి ఇళ్ల స్థలాల కోసం జగిత్యాల జర్నలిస్టుల డిమాండ్ వినిపిస్తుందన్నారు.
https://public.app/video/sp_n2d9yn47drd0n?utm_medium=android&utm_source=share
జర్నలిస్టులు కొత్తగా అడిగింది ఏమీ లేదని, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టులకు హామీ ఇచ్చిందన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీ నెరవేరకుండా కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారని తెలిసిందని ఈ పద్ధతి మానుకోవాలని హితవు పలికారు.
జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు.జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడమే కాకుండా కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా కూడా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులకు ఇచ్చే రాయితీ రైల్వే పాసులను పునరుద్ధరించాలని జర్నలిస్టులు ఎంపీ కి వినతిపత్రం అందజేశారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.