# Tags
#సాంస్కృతికం #Events #ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలుగా శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్ నియామకం అయ్యారు.

ఈ సందర్భంగా @telanganareporter ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ శుభాకాంక్షలు.

తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా నియామకం అయిన సందర్భంలో తెలియజేసిన ప్రేమ, గౌరవం, ప్రోత్సాహం నా కోసం ఎంతో విలువైనదని శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు.

సాహిత్యం, కళ, సంస్కృతి, సమాజ సేవ అనే ఈ పథంలో సాహితీ స్నేహితుల ఆదరణే నా బలమూ, ప్రేరణ కూడా ఎంతో ఉందన్నారు.

తెలుగు భాషా సాహిత్యాభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాననీ, తన నియామకం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.