# Tags
#తెలంగాణ

జగిత్యాల ప్రజావాణి లో అదనపు కలెక్టర్ లతో వాగ్వివాదాలకు దిగిన మున్సిపల్ కమిషనర్

జగిత్యాల ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లతో వాగ్వివాదాలకు దిగిన మున్సిపల్ కమిషనర్

-నేనూ గ్రూప్ 1 ఆధికారినేనంటూ దబాయింపు
-కలెక్టర్ ఉత్తర్వులూ బేఖాతరు…

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి ఒక్కసారి వేడెక్కింది. ఉదయం 10-30 నుండి మధ్యాహ్నం 1-30 వరకు సాగే ప్రజావాణి కి 1 గంట ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య చేరుకున్నాడు. దీంతో అదనపు కలెక్టర్ లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి లు ప్రజావాణి కి ఇంత ఆలస్యమా రావడం అని సుత్తిమీత్తగా మందలించారు. దీంతో కమిషనర్ సమ్మయ్య నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ…నేనూ గ్రూప్ 1 ఆధికారినేనంటూ ఉన్నతాధికారులని కూడా చూడకుండా నిర్లక్ష్యంగా బదులిచ్చారు. దీంతో అదనపు కలెక్టర్లు కమిషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోని ఈ ఘటనతో అధికారులందరూ అవాక్కయ్యారు.ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.ఈ ఘటన పట్ల జిల్లా అధికారులు కమిషనర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి, మున్సిపల్ పరంగా ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ… ఫైళ్ళన్నీ పెండింగులో పెట్టడం, పాలకవర్గంతో సఖ్యత్తగా లేకపోవడంతో కలెక్టర్ దృష్టికి కూడా ఛైర్పర్సన్ తీసుకువెళ్లిన సందర్భంను కూడా అధికారులు చర్చించుకుంటున్నారు. గత ఆగస్ట్ ఏర్పాట్లను కూడా సరిగా చేయకపోవడం, నిర్లక్ష్యపు వ్యవహారంతో ఉన్నతధికారుల్లో ఆయనపట్ల అసంతృప్తి పెరుగుతూ వస్తుందంటున్నారు. అంతే కాకుండా డబుల్ బెడ్ రూం లకు సంబంధించిన సర్వే కోసం మున్సిపల్ సిబ్బందిని కమీషనర్ గా తనకు తెలియకుండా కేటాయించారని ఒక రోజు వారిని సర్వేకు వెళ్లొద్దని కూడా హుకుం జారీ చేశారని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఉన్నాదికారుల్లో పెరిగిన అసంతృప్తి సోమవారం నాటి ప్రజావాణి లో బయటకొచ్చిందని కొందరు అధికారులు అంటున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం దిక్కరించడం పట్ల ఉన్న ఆగ్రహం ఈ రీతిన బయటపడిందని చెప్పుకోవచ్చు.