# Tags
#తెలంగాణ #జగిత్యాల #సాంస్కృతికం

అంగరంగ వైభవంగా నక్కలగుట్ట నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

రాయికల్ : S. Shyamsunder

మండలంలోని భూపతిపూర్ గ్రామంలో శ్రీ నక్కలగుట్ట నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం రోజు ఆలయ కమిటీ నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

వేములవాడ రాజరాజేశ్వర పుణ్యక్షేత్ర అర్చకులు గిరిధరచార్యుల పర్యవేక్షణలో వెంకటరమణ, వెంకటకృష్ణ సమక్షంలో నృసింహస్వామి పూజలు అందుకున్నారు.

కల్యాణ మహోత్సవ కార్యక్రమ అనంతరం భక్తులు వారి మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు,ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలు స్వీకరించారు.

సాయంకాల వేళ సతీ సమేతంగా నరసింహ స్వామి రథంలో భూపతీపూర్ పుర వీదులగుండ బయలు దేరి భక్తులకు దర్శన భాగ్యం కలిగించాడు. ఈ రథోత్సవ కార్యక్రమంలో అధిక మొత్తంలో భక్తులు హాజరై స్వామి వారి కృపకి పాత్రులయ్యారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సంకోజీ మహేష్,జక్కుల చంద్ర శేఖర్, మహేశ్వర్ రావు, నిమ్మల శేఖర్,ముత్యం రెడ్డి, మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు హాజరయ్యారు.