# Tags

నామని సుజనా దేవికి బహుమతి,ఆమె రచనలపై డాక్టరేట్

ముల్కనూరు: M. కనకయ్య


ముల్కనూరు ప్రజా గ్రంథాలయము-నమస్తే తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీలో విజేతలకు బహుమతుల పంపిణీ అంగరంగ వైభవంగా జరిగింది.

ఈకార్యక్రమానికి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు తెలంగాణ గీత రచయిత అందెశ్రీ హాజరై, నామని సుజనా దేవికి బహుమతి,ఆమె రచనలపై డాక్టరేట్ ను వారి చేతులమీదుగా అందజేశారు.

ముఖ్యమంత్రి ఓ ఎస్ డి వేముల శ్రీనివాసులు ఆధ్వర్యంలో
ముల్కనూరులో జరిగిన ఈ వేడుకలలో, మంత్రి మరియు సినీ గాయకుడు అందెశ్రీ, ముల్కనూరు సహకార సంఘ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ కుమార్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ చేతుల మీదుగా బహుమతులను విజేతలకు అందజేశారు.


ఈ పోటీకి దేశ విదేశాల నుండి 470 కథలు వచ్చాయని అందులో 70 కథలను బహుమతులకు వివిధ తరగతుల కింద ఎంపిక చేసినట్లుగా వేముల శ్రీనివాసులు మరియు న్యాయ నిర్ణీతలు చెప్పారు.

ముఖ్యంగా న్యాయ నిర్ణీత శశిధర్ (రిజిస్ట్రార్ ఆఫ్ టాక్స్ అండ్ స్టాంప్స్ కమిషనర్), ప్రతి కథలోని సాహితీ హితమైన అంశాలను విపుళీకరించడం విశేషం.

ఇందులో తృతీయ బహుమతికి, స్థానిక కరీంనగర్ నివాసి, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కార గ్రహీత, రచయిత్రి నామనీ సుజనా దేవి గారి, “క(ఖ)ర్మయోగి” కథ ఎంపిక అయ్యింది. రచయిత్రి, మంత్రి మరియు అందెశ్రీల నుండి బహుమతి స్వీకరించిన సందర్భంలో ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

కాగా, ఇటీవల నామని సుజనా దేవి రచనల పైన కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పర్లపల్లి శ్రీశైలం అనే విద్యార్థి, ఆచార్య పంతంగి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డాక్టరేట్ పట్టా పొందారు.

ఈ సందర్భంగా రచయిత్రిని కీర్తి పురస్కార గ్రహీత డాక్టర్ ముదిగంటి సుధాకర్ రెడ్డి, పలువురు సాహితీవేత్తలు అభినందించారు.