# Tags

నిబంధనల ప్రకారం కలెక్టరేట్ లో జాతీయ పతాకావిష్కరణ :: జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి వి. శ్రీధర్


రాజన్న సిరిసిల్ల జిల్లా :

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ నిబంధనలో ప్రకారం జాతీయ పతాకావిష్కరణ చేశారని ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి వి. శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

షూ వేసుకుని జాతీయ జెండా ఆవిష్కరించడం వల్ల జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ అవమానిస్తున్నట్లు ఆరోపిస్తూ, కలెక్టర్ పట్ల అమర్యాదగా అసభ్య పదజాలంతో  తంగళ్ళపల్లి వార్తలు, ముచ్చర్ల స్నేహితులు, తదితర వాట్సప్ గ్రూప్ లలో తప్పుడు సందేశం పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని , పోలీసు కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు.

ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం జాతీయ పతాకావిష్కరణ చేసే సమయంలో వేసుకోవడం నిషేధమని ప్రత్యేకంగా ఎక్కడ రాయలేదని, ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు న్యాయమూర్తులు అందరూ ప్రోటోకాల్ ప్రకారం జెండా వందనం చేస్తారని, కావాలని రాజకీయ దురుద్దేశంతో కొంతమంది జిల్లాలో జిల్లా కలెక్టర్ పై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

చట్టబద్ధ నిబంధన కాదని తెలిపారు. కలెక్టర్ పట్ల తప్పుడు ఆరోపణలు చేస్తూ, అసభ్యంగా మెసేజ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని డి.పి.ఆర్.ఓ తన ప్రకటనలో హెచ్చరించారు.