# Tags

రాయికల్ పట్టణంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

రాయికల్ : ఎస్. శ్యామసుందర్

పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సంఘ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ, భారత దేశ సంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచే చేనేతకు గుర్తుగా దేశ వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని అన్నారు.

అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని చేనేత కార్మికులకు సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి అధ్యక్షుడు బోగ రాజేశం, ఉపాధ్యక్షుడు దాసరి గంగాధర్, కార్యదర్శి కడకుంట్ల నరేష్, కోశాధికారి ఆడేపు నర్సయ్య, యువజన సంఘం అధ్యక్షుడు సామల్ల సతీష్ , రాజీవ్, నవీన్, సింగని సతీష్ సంఘ మాజీ అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం, గాజంగి అశోక్, బొమ్మకంటి రాంగోపాల్, మాజీ సర్పంచ్ మచ్చ నారాయణ, మాజీ కౌన్సిలర్ మ్యాకల కాంతారావు మామిడాల లక్ష్మీనారాయణ, హనుమాన్ దేవాలయం చైర్మన్ దాసరి గంగాధర్,దిలీప్, వాసం స్వామి ,సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.