# Tags

నూతన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా:

ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ తెలంగాణ రిపోర్టర్ జిల్లా ప్రతినిధి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంజ సంపత్ కుమార్ అధ్యక్షతన ప్రారంభోత్సవం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దొమ్మాటి నరసయ్య, సద్ది లక్ష్మారెడ్డి,రాంరెడ్డి, జిల్లా నాయకులు గౌస్, శ్రీనివాస్ ళు హాజరై ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య మాట్లాడుతూ ఇది శుభ పరిణామమని ఎల్లారెడ్డిపేటలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలను ముందుకు నడిపిస్తూ, ప్రజా సమస్యలను వెలికితీస్తూ ముందుకు సాగుతున్న ప్రింట్ అండ్ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులను ఆయన అభినందించారు.

ఎల్లో జర్నలిజం చేయవద్దని నిజాన్ని నిర్భయంగా రాసే స్వేచ్ఛ కలిగి ఉండాలని తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని, స్వేచ్ఛాయుతంగా నిజంగా, నిర్భయంగా రాయాలని ఆయన కోరారు.

మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గౌస్, మేడిపల్లి దేవానందం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులకు అండగా ఉంటుందని, ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా అండదండగా ఉంటామని,జర్నలిస్ట్ ల కు ఇండ్ల స్థలాలు అందించడానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పార్టీ నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్ది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేస్తామని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంజ సంపత్ కుమార్, గాంధీ బాబు,రెడ్డి మల్ల సత్యనారాయణ,రమేష్ నారాయణ, భూ శంకర్, కృష్ణ, ప్రెస్ క్లబ్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.