#తెలంగాణ

త్వరలోనే నూతన రేషన్ కార్డులు మంజూరు-కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు…ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

రాయికల్: S.Shyamsunder
నిరుపేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని త్వరలోనే నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.

మంగళవారం రాయికల్ పట్టణంలోని ఓపెన్ జిమ్,మండలంలో మైతాపూర్ గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దావకాన భవనాన్ని ప్రారంభించి అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు దారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. గ్రామంలో సిఆర్ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 14 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి,గ్రామానికి చెందిన 7గురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 1 లక్ష5 వేల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. పల్లె దావకాన ఏర్పాటుతో తల్లి పిల్లలకు ,అంటూ రోగాలు,వివిధ పరీక్షలు,టీకాలు వంటి అనేక వ్యాధులకు పల్లె దవాఖానా లో వైద్య సేవలు పొందవచ్చు అన్నారు.

రాష్ట్రం లో 84 లక్షల కుటుంబాలకు జగిత్యాల నియోజకవర్గం లో 86వేల కార్డు లు 2 లక్షల మందికి 15 వేల క్వింటాళ్ల సన్న బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు.సన్న బియ్యం పంపిణీ పథకం ద్వారా రైతులు సన్న బియ్యం పండించడానికి ప్రోత్సాహకంగా ఉంటుందని,
సన్న వడ్ల కు 500 బోనస్ ఇవ్వడం తో రైతులకు మేలు జరుగుతుందన్నారు.దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి లో దూసుకుపోతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి జితేంద్ర ప్రసాద్,డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, వైద్యాధికారి రవీందర్, మండల పంచాయతీ అధికారి సుష్మా, ఏఈ ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు,మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గన్నే రాజిరెడ్డి,మండల,
నాయకులు కోల శ్రీనివాస్,రవీందర్ రావు,శ్రీనివాస్ గౌడ్, ముఖీద్ ,శ్రీనివాస్,అచ్యుత రావు,రాజీరెడ్డి,మోహన్,జక్కుల చంద్ర శేఖర్,తిరుపతి గౌడ్,రవీందర్ గౌడ్,గంప ఆనందం, కొల్ల నారాయణ,దాసరి గంగాధర్, జలపతి, తిరుపతి మల్లయ్య, సత్తన్న,కిషన్ రావు,మహేంద్ర బాబు,సురవిజయ్,చంద్ర తేజ,దశరత్,శుక్రూ,అధికారులు,నాయకులు,మహిళలు,రైతులు,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *