# Tags
#Blog

NSV అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు-విద్యార్థుల్లో జోష్

జగిత్యాలలో జోష్ నింపిన మల్యాల X రోడ్డు NSV అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని, ఉపాధ్యాయులు బోధించిన విధానాలను తప్పనిసరిగా పాటిస్తూ సమాజంలో ఆదర్శంగా జీవితాన్ని కొనసాగించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు.

జగిత్యాల పట్టణంలోని రెడ్డి కన్వెన్షన్ హాల్లో ఫ్లోరెన్స్ పేరుతో నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు‌.

జ్యోతి ప్రజ్వలన చేసి, సరస్వతి మాతకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించి, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…విద్యార్థులకు నైపుణ్యం చాలా ముఖ్యమైనదని మరియు నేటి పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి సృజనాత్మకతను పెంపొందించుకొని ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు కృషి చేస్తూ అత్యుత్తమ విద్యను అందిస్తూ వారిని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపే ప్రయత్నంలో ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని తెలుపుతూ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యా విధానాలు చాలా యోగ్యమైనవని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అన్నారు.

ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల యొక్క మాటను అనుసరించి వారి ఆశయాలను నెరవేర్చి ఉన్నత స్థానాలలో స్థిరపడి ఆదర్శంగా ఉండాలన్నారు.

ముఖ్యంగా నేటి కాలంలో విద్యార్థులందరూ కృత్రిమ మేధస్సు గురించి తెలుసుకోవాలని, సమాజంలో చోటు చేసుకున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని అన్నారు.

వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్వహింపబడిన వివిధ పరీక్షలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఆలోచింపచేసాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఏఓ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు