న్యూ ఢిల్లీ :
ఓసి ల మహా ధర్నాకు అనూహ్య స్పందన, విజయవంతం చేసిన ఓసి ఐకాస జాతీయ రాష్ట్ర నాయకుల కు ప్రత్యేక కృతజ్ఞతలు : ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సంపూర్ణంగా పటిష్ట అమలుకు జాతీయ స్థాయి ఓసి కమిషన్ . ఏర్పాటు చేయాలనీ , రైతుకు గిట్టుబాటు ధరకు రైతు భాగస్వామ్యం ఉండే చట్టం తేవాలనే ప్రథాన డిమాండ్ల తో జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓసి ల మహాధర్నాకు అనూహ్య స్పందన లభించిందని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఓసి జేఏసీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి.. లు మంగళవారం నిర్వహించిన ఢిల్లీ ఆంధ్రభవన్ మీడియా సమావేశంలో తెలిపారు.
రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అసత్య ప్రచారాలు చేస్తున్న కుట్రలను సాగానివ్వబోమని , దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావుతో పాటు పలువురు ఓసి ఐకాస జాతీయ రాష్ట్ర నాయకులు పిలుపు నిచ్చారు. ఓసి పేదల న్యాయమైన డిమాండ్ల సాధనకు సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఓసి ల మహాధర్నా నిర్వహించారు.
వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ఓసి ఐకాస రాష్ట్ర నాయకులు మహా ధర్నాకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఓసి ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, జాతీయ చైర్మన్ నల్లా సంజీవ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడి శెట్టి పశుపతి, ఉపాధ్యక్షులు చందుపట్లనరసింహ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్,జేఏసీ గౌరవ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ,గంగు ఉపేంద్ర శర్మ, బుస్సా శ్రీనివాస్, రాయపాటి వెంకటేశ్వర్ రావు,నడిపెళ్ళి వెంకటేశ్వర్ రావు, చిలుపూరి ప్రతాప్ రెడ్డి,జనగామ కరుణాకర్ రావు లు మాట్లాడుతూ…ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్లూఎస్ రిజర్వేషన్ల పై రాజకీయ పబ్బం కోసం కొన్ని దుష్ట శక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతూ చేస్తున్న అసత్య ప్రచారాలు, పన్నుతున్న కుట్రలను సాగనివ్వ బోమని స్పష్టం చేశారు.దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు.
ఓసి ల జనాభా 22శాతం ఉంటుందని ఇందులొ సయ్యద్, పఠాన్ లు ఉన్నారని స్వార్థ రాజకీయ ప్రయోజనాల ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసి లను పలుచన చేయాలనే కుయుక్తులను సాగనివ్వబోమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓసి లకు నేటికీ రాజకీయ రిజర్వేషన్లు లేక తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని వివిధ రాష్ట్రాల స్ధానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం ఎదుటివారి ఆర్థిక, అంగబలం ముందు ఓసి అభ్యర్ధులు సరితూగలేక జనరల్ స్థానాల్లో కనీసం 20 శాతం సీట్లు కూడా గెలుచుకోలేక పోతున్నారని పోలాడి రామారావు తోపాటు ఐకాస నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటు బ్యాంకు రాజకీయాలతో ఓసి లకు నేటికీ తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే తమ ఓసి జేఏసీ ధ్యేయమని పేర్కొన్నారు. స్ధానిక ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్లు ఓసి లకు కూడా కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఓసి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని , ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 10 లక్షల రూ.ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల లో పేదలకు సంపూర్ణ న్యాయం జరగడం లేదని అందువల్ల అన్ని వర్గాల పేద విద్యార్థులకు విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షలలో న్యాయం కోసం అమలవుతున్న రిజర్వేషన్లలో క్రిమిలేయర్ పద్దతి అమలు చేయాలని ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని కోరారు.
రైతుల భీమావయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, రైతు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించటానికి రైతు భాగస్వామ్యంతో ప్రత్యేక చట్టం తేవాలని సూచించారు, జాతీయ ఉపాధి హామీ పథకం ను వ్యవసాయ రంగం తో అనుసందానించాలని డిమాండ్ చేశారు,తమ డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందు కోసమే దేశరాజధాని ఢిల్లీ వేదిక గా ఈనాటి ధర్నా నిర్వహించామని వెల్లడించారు.
తాము వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించినా ఏ ఒక్క రాజకీయ పార్టీల ఓసి ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించి రాబోయే ఎన్నికల్లో మా దెబ్బకు అబ్బో అనే విధంగా దీటుగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఈ ధర్నా కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ఓసి ఐకాస జాతీయ,రాష్ట్ర నాయకులు
పలువురు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకుల తో పాటు 500 మందికి పైగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఓసి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి , జాతీయ కార్యదర్శి గొట్టెముక్కుల ప్రభాకర్ రెడ్డి, ప్రవాసాంధ్రుల ఓసి ఐకాస నాయకులు కూరతోట సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకుడు రావుల నరసింహ రెడ్డి పాల్గొన్నారు..
ఇప్పటికైనా ప్రభుత్వాలు వెంటనే డిమాండ్లను పరిష్కరించాలని లేకుంటే ఆరు నెలలు గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వాలను స్పందింప జేస్తామని హెచ్చరించారు. మా పోరాటం మాలోని పేదల సమస్యల పరిష్కారానికి,పాటు రైతాంగ సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేస్తున్నామని ఇతర సామాజిక వర్గానికి చెందిన పేదల సమస్యల పరిష్కారానికి సంఘీభావంగా మద్దతు తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.




