# Tags

జిల్లాలో ఇప్పటివరకు 5వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు : జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి జి.శ్యాంప్రసాద్

 జగిత్యాల:

జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 5 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయబడుతుందని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి జి.శ్యాంప్రసాద్ వెల్లడించారు.

మంగళవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్  గ్రామంలో ఆయిల్ పామ్ సాగు పద్ధతులపై, తోటల యాజమాన్యం మరియు ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న  రాయితీ సదుపాయాల గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి శ్యాంప్రసాద్.. లోహియా కంపెనీ జిల్లా మేనేజర్ విజయ్ భరత్ తో కలిసి ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో ఇప్పటివరకు 5000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయబడుతుందని మరియు త్వరలోనే యశ్వంతరవుపేట గ్రామంలో  లోహియా కంపెనీ వారు ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నారని ఆయన తన ప్రకటనలో వివరించారు., ఒకవేళ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి కావడానికి ఆలస్యం జరిగినా పంట దిగుబడి కొని రైతులకు వారం రోజుల్లో డబ్బులను వారి వారి ఖాతాలకు జమ చేసే పూర్తి  భాద్యత లోహియా కంపెనీ భరిస్తుందని తెలిపారు. ఈ మేరకు వారికి ప్రభుత్వం తో ఒప్పందం జరిగిందని  తెలిపారు.

https://public.app/video/sp_c365ha9n8mbpm?utm_medium=android&utm_source=share

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి. భాస్కర్ , మండల వ్యవసాయ అధికారి శ్రీమతి. జ్యోతి ,  రాజేష్ (ఏ ఈ ఓ), అనిల్ కుమార్ ( హెచ్ ఈ ఓ) మరియు  లోహియా కంపెనీ జిల్లా మేనేజర్ విజయ్ భరత్ పాల్గొన్నారని తెలిపారు.