# Tags
#తెలంగాణ

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా…ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సందర్శనలో …

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఎంపీ వంశి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ సింగ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సందర్శించారు.

స్వామి వారికి నిర్వహించిన పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు.

అనంతరం ఉదయం 5 గంటలకు ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వైకుంఠ ద్వారాలు తెరవగా, స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా పూజాది, దర్శన కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు, వేదంపండితులు ఆశీర్వచనములందించి, ప్రసాదములందించారు.

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని,

ఆ దేవ దేవుడి ఆశీస్సులు,ధర్మపురి నియోజకవర్గ ప్రజానీకం పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చే విధంగా ఆ భగవంతుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి శక్తిని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.