# Tags
#అంతర్జాతీయం #ఎడ్యుకేషన్ & కెరీర్ #తెలంగాణ

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేకదినం సందర్భంగా…పోస్టర్ ఆవిష్కరించిన సిఎం

జులై 30 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం (World Day against Trafficking in Persons) సందర్భంగా ప్రజ్వల ఫౌండేషన్ వారు రూపొందించిన పోస్టర్ ను మహిళా శిశు సంక్షేమ, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి సీతక్క తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

హ్యూమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా పోరాడుతోన్న ప్రజ్వల ఫౌండేషన్ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ ని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ప్రజ్వల ఫౌండేషన్ వారికి ప్రజాప్రభుత్వం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.

హ్యూమన్ ట్రాఫికింగ్ కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అలాగే మత్తు పదార్థాల నిర్మూల కోసం కూడా ప్రత్యేకంగా టీ న్యాబ్ విభాగాన్ని బలోపేతం చేశామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ , కమిషనర్ కాంతి వెస్లీ , ప్రజ్వల ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.