# Tags

స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా పద్మశాలి సంఘ ఎన్నికలు, అధ్యక్షులుగా గెలుపొందిన భోగ రాజేశం 

రాయికల్ : ఎస్.శ్యామసుందర్ :

స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా రాయికల్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఎన్నికలు ఆదివారం రాయికల్ లోని ఆ సంఘం కళ్యాణ మండపంలో జరిగాయి.

అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి,కోశాధికారి, ఉపాధ్యక్ష పదవులకు జరిగిన ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.గత పది రోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్ల ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు.ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ప్రచారం చేస్తూ ఎన్నికల రోజైన ఆదివారం వృద్ధులు, వికలాంగులను ఆటోలపై తరలించి ఓటు హక్కును వినియోగింప చేశారు.

పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు స్థానిక సంస్థల ఎన్నికలను తలపించాయి.పద్మశాలి సంఘం ఎన్నికల అధ్యక్ష బరిలో భోగ రాజేశం,గాజంగి అశోక్, ప్రధాన కార్యదర్శి బరిలో మామిడాల లక్ష్మీనారాయణ, కడకుంట్ల నరేష్,కోశాధికారిగా బరిలో ఆడెపు నరసయ్య,కడకుంట్ల ప్రభాకర్,సామల్ల సత్యనారాయణ,ఉపాధ్యక్షులుగా దాసరి గంగాధర్, మామిడాల రాజేందర్,మిట్టపెల్లి జగదీశ్వర్,శ్రీపతి లక్ష్మీనారాయణ నిలిచారు.

కాగా హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా భోగ రాజేశం,ప్రధాన కార్యదర్శిగా కడకుంట్ల నరేష్,కోశాధికారిగా ఆడెపు నర్సయ్య,ఉపాధ్యక్షులు దాసరి గంగాధర్ లు గెలుపొందారని ఎన్నికల అధికారులు గా వ్యవహరించిన దాసరి రామస్వామి,ఎలిగేటి రాజ్ కిషోర్, సింగని రామదాస్, గాజంగి రాజేశం, భూమేశ్వర్,సత్యనారాయణ లు వెల్లడించారు.