# Tags
#Blog

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే “అన్యమత ప్రచారం నిషేధం” : గ్రామ ప్రజలు

అంబారిపేట (జగిత్యాల ) :

మతమార్పిడి పేరుతో ప్రజలకు మభ్యపెడితే కఠినమైన చర్యలు తప్పవు- హిందూ సంఘా నాయకులు వేముల సంతోష్

జగిత్యాల గ్రామీణ మండలం అంబారి పేటలో దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద అన్యమత ప్రచారం నిషేధం సూచిక బోర్డును ఏర్పాటు చేశామని,

ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం మా గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు అన్య మత ప్రచారం నిషేధం అంటూ సూచిక బోర్డు ఏర్పాటు చేయగా ఆ బోర్డును తీసివేయాలంటూ ఓ వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు ఆ సూచన బోర్డును తొలగించాలని గ్రామస్తులపై ఒత్తిడి చేయడంతో మంగళవారం మధ్యాహ్నం గ్రామస్తులందరూ అధికారుల చర్యలను ఖండించారు.

ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు గ్రామ సర్పంచ్ గంగాధర్ హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ తమ గ్రామానికి కొంతమంది క్రిస్టియన్ మత ప్రచారకులు వచ్చి గ్రామానికి చెందిన మహిళలను మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చారని, ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వారిని గ్రామం నుండి పంపివేశామని తెలిపారు.

దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామ సర్పంచ్ పై ఓ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయడం జరిగిందన్నారు.

పవిత్రమైన దేవాలయం కొండపై గుర్తుతెలియని వ్యక్తులు సిలువ గుర్తు ఏర్పాటు చేశారని, ఈ విషయంలో కూడా వివాదం చెలరేగిందని గుర్తు చేశారు.

పవిత్రమైన ఆలయం వద్ద అన్యత ప్రచారం, అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదనే ఉద్దేశంతో తాము ముందస్తు జాగ్రత్త ఈ సూచిక బోర్డును ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

గ్రామస్తుల మనోభావాలకు వ్యతిరేకంగా కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర మతస్తుల నుండి తమ గ్రామస్తులను, దేవాలయాన్ని, గ్రామాన్ని రక్షించుకోవడం తమ అందరి బాధ్యత అని ఈ విషయాన్ని అధికారులు సహకరించాలని కోరారు

ఎవరైనా మతపరమైన ప్రచారం గానీ మతమార్పిడి పేరుతో ప్రజలకు మభ్యపెడితే కఠినమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హిందూ సంఘా నాయకులు వేముల సంతోష్ హెచ్చరించారు

ఈ సందర్భంగా హిందూ సంఘం నాయకులు అక్కడికి చేరుకొని వారికి సంఘీభావం తెలిపిన లింగంపేట శ్రీనివాస్, అంకార్ సుధాకర్, వేముల సంతోష్, జిట్టవేణి అరుణ్ కుమార్ గాజోజు సంతోష్, వారికి సంఘీభావం తెలిపారు.