# Tags
#ఎడ్యుకేషన్ & కెరీర్

పదవ తరగతి పరీక్షలో 9.8 మార్కులు సాధించిన పంజ యశ్వంత్

ఎల్లారెడ్డి పేట కు చెందిన పంజ యశ్వంత్ పదవ తరగతి పరీక్షల్లో 9.8 మార్కులు సాధించారు.

రాజన్నసిరిసిల్ల జిల్లా తెలంగాణ రిపోర్టర్ పంజ సంపత్ కుమార్ కుమారుడు కరీంనగర్ లోని ఆల్ఫోర్స్ హై స్కూల్ లో చదివి 9.8 మార్కులు సాధించారు.

భవిష్యత్ లో మంచి కార్డియాలజీస్ట్ కావా లనుకుంటున్నాను అని అన్నారు.

తన తల్లి భాగ్య లక్ష్మి బోయినపల్లి మండలంలోని కొదురుపాక ప్రభుత్వ ఆసుపత్రి లో స్టాఫ్ నర్సు గా పనిచేస్తోంది.తన తల్లిని స్ఫూర్తిగా తీసుకుని వైద్య వృత్తి చేయాలని ఆశగా ఉందని యశ్వంత్ అన్నారు.9.8 మార్కులు సాధించిన పంజా యశ్వంత్ కుమార్ ను స్థానిక తాజా మాజీ ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ లు అభినందించారు.