శతాబ్ది ఖండ పథసంచలనంలో జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ కొంగరి సాయికృష్ణ
–రాయికల్: ఎస్. శ్యామసుందర్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాయికల్ ఖండ ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఖండ కేంద్రంలో స్వయం సేవకులు ఘనంగా పథసంచలనం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ కొంగరి సాయికృష్ణ ప్రధాన అతిథిగా హాజరై, మాట్లాడుతూ, “ఈ దేశంలో పుట్టడం అదృష్టం అయితే, హిందువుగా పుట్టడం మహా అదృష్టం” అని పేర్కొన్నారు. హిందువులందరూ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉండి సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

దేశంలో ఆర్.ఎస్.ఎస్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సర్వాంగీణ వికాసం కోసం కృషి చేస్తోందని అన్నారు.
సంఘం శతాబ్దిని పురస్కరించుకుని ఏడు రకాల కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. దసరా ఉత్సవాలతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, రెండవ దశలో జనజాగరణ కార్యక్రమాలు, జనవరిలో హిందూ సమ్మేళనాలు, ఫిబ్రవరిలో సద్భావన సదస్సులు, యువ సమ్మేళనాలు, మేధావుల సదస్సులు, చివరగా ప్రతి గ్రామంలో శాఖ ప్రారంభించే కార్యాచరణ కొనసాగుతుందని వివరించారు.

దేశ సమాజ పరివర్తన వ్యక్తి పరివర్తన ద్వారానే సాధ్యమని, స్వదేశీ, పర్యావరణ రక్షణ, కుటుంబ వ్యవస్థ బలోపేతం, సామాజిక సామరసత, పౌర విధుల ఆచరణ అనే “పంచ పరివర్తన” భావన సమాజ మార్పుకు పునాది రాళ్లు అవుతాయని చెప్పారు.
అసుర శక్తులపై దైవ శక్తి విజయం సాధించిన సందర్భమే విజయదశమి అని, అదే ధర్మ రక్షణ కోసం 1925లో డాక్టర్ హెడ్గేవార్ ఆర్.ఎస్.ఎస్ స్థాపించి దేశంలో ధర్మ ప్రతిష్ఠాపనకు నాంది పలికారని ఆయన స్మరించారు. స్వయం సేవకులు చిన్నతనం నుంచే పిల్లల్లో సాంప్రదాయ, సాంస్కృతిక విలువలను నాటే బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఖండ కార్యవాహ్ వేల్పుల స్వామి యాదవ్, జిల్లా సహశారీరక్ ప్రముఖ్ నూతికట్ల సత్యం, ఖండ బాధ్యులు దొంగ జితేందర్ రెడ్డి, కుర్మ మల్లారెడ్డి, తోపారపు రవీందర్, ఎద్దండి ముత్యం రాజు, తురగా రాజారెడ్డి, బొమ్మకంటి రాంగోపాల్, గాజెంగి అశోక్, గన్నవరం గంగాధర్, పందిరి లక్ష్మీనర్సయ్య, అంబల్ల శివ, చెంగళి మహేష్, ఆకుల మహేష్, కుర్మ చిన్న మల్లారెడ్డి, వాసం జలంధర్, సద్ది మహిపాల్ రెడ్డి, కుర్ర శ్రీనివాస్, చిలుకమర్రి మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. రాయికల్ నగరంతో పాటు పరిసర గ్రామాల నుండి గణవేషధారి సుమారు 430 మంది స్వయం సేవకులు ఈ పథసంచలనంలో పాల్గొన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





