# Tags
#తెలంగాణ

అన్ని వర్గాల ప్రజలతో బీజేపీ సభ్యత్వం చేయించాలి: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్, ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి…… (తెలంగాణ రిపోర్టర్)

భారతీయ జనతా పార్టీ సంస్తాగత ఎన్నికల సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కామారెడ్డి సంస్థాగత ఎన్నికల పర్యవేక్షణ అధికారి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ మాట్లాడుతూ… బీజేపీ దేశ వ్యాప్తంగా సంస్తగత మార్పుల్లో భాగంగా ఈ నెల 15 నుండి బీజేపీ బూత్ కమిటీల ఎన్నికలు నిర్వహించనున్నమని 100 సభ్యత్వాలు జరిగిన బూత్ లోనే ఎన్నికలు ఉంటాయనీ అన్నారు. కావున ఇంకా 100 సభ్యత్వం పూర్తి కానీ బూత్ లలో 100 సభ్యత్వాలు పూర్తి చేయాలని అన్నారు. మండలానికి 100 క్రియాశీల సభ్యత్వాలు తప్పనిసరి అని అన్నారు.

ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ… 50 సభ్యత్వాలు చేసిన మహిళలు క్రియాశీల సభ్యత్వనికి అర్హులు అని కావున మహిళా కార్యకర్తలు 50 సభ్యత్వాలు పూర్తి చేసి క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల ప్రజలతో బీజేపీ సభ్యత్వం చేయించాలనీ ముఖ్యంగా యువత, మహిళలను సభ్యత్వం చేయించాలనీ గుర్తు చేశారు. రాబోయే కాలంలో పార్టీ పదవుల రావాలంటే క్రియాశీల సభ్యత్వం తప్పనిసరి అని నిబంధన ఉన్నదని కావున ప్రతి నాయకుడు 100 సభ్యత్వాలు పూర్తి చేసి క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని అన్నారు.