# Tags
#తెలంగాణ

వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శనలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  శ్రీధర్ బాబు

రామగుండం :

వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు.  రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ , పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును  పరిశీలించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారుతుందని,  ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు సామ్యర్థం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో తీరును పరిశీలించారు.

ఎస్ ఆర్ ఎస్ పి , కడెం ప్రాజెక్టుల నుండి పెద్దఎత్తున వరద ప్రవాహం ఎల్లంపల్లి కి రావడంతో 33 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున…. గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.

వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు వరద వచ్చే నేపథ్యంలో  రెవెన్యూ పోలీస్ మున్సిపల్ , నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అధికార యంత్రాంగం  అప్రమత్తంగా ఉండాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *