# Tags
#తెలంగాణ #జగిత్యాల

భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల.

భారీ వర్షాల దృష్ట్యా జిల్లా , ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సత్యప్రసాద్

రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాల మేరకు రానున్న 3 రోజులలో అతి భారీవర్షాల దృష్ట్యా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశాలు

రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి ఆదేశాల మేరకు రానున్న మూడు రోజులలో అతి భారీ వర్షాల దృష్ట్యా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి అన్న సమాచారం మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ జిల్లా అధికారులతో టెలి కౌన్సిల్ ద్వారా సమావేశం నిర్వహించి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

https://public.app/video/sp_4ufofw6umv9cb?utm_medium=android&utm_source=share

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎవరికి సెలవులు మంజూరు లేదని స్పష్టం చేశారు అధికారులందరూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు

చెరువుల వద్ద, గోదావరి వద్ద మరియు వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు తక్షణ సహాయం కోసంకు డయల్ నెంబర్ 1800 425 7620 సమాచారం ఇవ్వాలని కోరారు.
పోలీసు అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వర్షాల దృష్ట్యా కరెంటు స్తంభాల దగ్గరకు ఎవరు వెళ్లకూడదన్నారు.

వర్షానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి ఇండ్లు కూలిపోయే అవకాశం ఉంటుందని అందులో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్లు .ఆర్డీవోలు. సంబంధించిన జిల్లా అధికారులు. డిఎస్పీలు. మున్సిపల్ కమిషనర్లు .మండల స్థాయి అధికారులు .వివిధ శాఖ అధికారులు తదితరులుపాల్గొన్నారు.