# Tags

ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల జిల్లా :

ఎండలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కోరారు.

ఎండలు, వడగాలులతో జరిగే ప్రమాదాలు పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని, అకాల వర్షాలు వల్ల భూమి నుండి వేడి వస్తుందని, ఎండ తీవ్రత కూడా అధికంగా ఉంటున్నందున ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు ఆరోగ్య సంరక్షణ చర్యలు పాటించాలని సూచించారు.ఎండ బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, ఎండ అధికంగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండాలని తెలిపారు.

అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు బయటికి రాకూడదని, ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల మద్య ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ప్రజలు ఇళ్లు నుంచి బయటకు రావొద్దని సూచించారు.

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడ దెబ్బలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.చిన్నారులు, వయోవృద్దులతో ప్రయాణం శ్రేయస్కరం కాదని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.

ఇంటి నుండి బయటికి వస్తే తలకు ఎండ తగలకుండా గొడుగు, కండువా,టోపితో కవరు చేయాలని సూచించారు. మంచినీళ్లు అధికంగా తీసుకోవాలని తీసుకోవాలని, వదులుగా ఉన్న కాటన్ దుస్తువులను ధరించాలని తెలిపారు.ఎండ అధికంగా ఉన్న సమయాల్లో దూర ప్రయాణాలు చేయకూడదని తెలిపారు.

వడదెబ్బకు గురికాకుండా తరచుగా ఓ.ఆర్.ఎస్ ద్రావణం, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలని తద్వారా వడదెబ్బ నుండి ఉపశమనం ఉంటుందని అన్నారు. ఎండలు వల్ల చర్మం పై ఎర్రటి దద్దుర్లు, పొడిబారడం లాంటి మార్పులను ప్రజలు గమనించాలని తెలిపారు.

వేడి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, అలసట, నోరు ఎండి పోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయక తక్షణమే సమీప ప్రభుత్వ ఆసుపత్రులల్లో వైద్య సేవలు పొందాలని తెలిపారు. అత్యవసర వైద్య సేవలకు 108 కు ఫోన్ చేయాలని అన్నారు.

ఉపాధి హామీ పథకం పనులు కూలీలు ఉదయం 6 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 6 గంటలు వరకు పనులు చేపించాలని, పనులు జరుతున్న ప్రదేశాల్లో రక్షణ, జాగ్రత్తలు పాటించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.