# Tags
#తెలంగాణ

బిజెపి చిగురుమామిడి మండల అధ్యక్షులుగా పోలోజు సంతోష్ నియామకం

చిగురుమామిడి: (M. Kanakaiah)

చిగురుమామిడి మండలం ముదిమానిక్యం గ్రామానికి చెందిన పొలోజు సంతోష్ ను చిగురుమామిడి బీజేపీ పార్టీ మండల అధ్యక్షలుగా నియమిస్తూ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో గురువారం తెలిపారు.

ఈ సందర్భంగా పోలోజు సంతోష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే, సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటి రెడ్డి రాంగోమల్ రెడ్డి, BJYM కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దుర్షెట్టి సంపత్, హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు.
చిగురుమామిడి మండలంలో బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.