# Tags
#తెలంగాణ

గణేష్ మండపాల వద్ద ప్రమాదాలు జరుగకుండ జాగ్రత్తలు తీసుకోవాలి:డి ఎస్పీ రఘు చందర్

రాయికల్ : ఎస్. శ్యామసుందర్ :

ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలి : జగిత్యాల డి ఎస్పీ రఘు చందర్

రాయికల్ పట్టణంలోని పద్మశాలి పంక్షన్ హాల్ లో గణేష్ మండపాలు నిర్వాహకులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన డిఎస్పీ రఘ చందర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ వినాయక మండపాల నిర్వహణ మరియు మండపంనకు సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే ఒక సైట్ రూపొందించిందని అన్నారు.

http://policeportal.tspolice.gov.in అనే సైట్ సమాచారం ద్వారా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందని ,ఇట్టి ఆన్ లైన్ నమోదు కు ఎటువంటి రుసుము లేదని తెలిపారు.

గణేష్ ఉత్సవాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయుటకు ముందు, ముందస్తు సమాచారం పోలీసు స్టేషన్ లో ఇవ్వాలని, అందుకోసం ఏదైనా కంప్యూటర్, మొబైల్ నందు అప్లై చేసుకోవాలి అని అన్నారు.


గణేష్ మండపాలను ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలనీ, విద్యుత్ శాఖ వారి అనుమతి పత్రంతోనే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని . మండపాలకు పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదేనని వివరించారు.

ప్రతి మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని లేని యెడల మండపాల కమిటీ వివరాలు, మండపల బాధ్యత వహించే వారి వివరాలు ఫోన్ నెంబర్లు మండపంలో ఏర్పాటు చేయాలన్నారు . 24 గంటలు 4గురు వాలంటరీ ఉండే విధంగా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలన్నారు .

భక్తుల సందర్శన దృష్టిలో ఉంచుకొని భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటరీలను నియమించాలని ,గణేష్ ప్రతిమలు కూర్చోబెట్టే ప్రదేశంలో షెడ్డు నిర్మాణం మంచి నాణ్యతతో ఏర్పాటు చేసుకోవాలి, షార్ట్ సర్క్యూట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.

మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తతో, మంటలు ఆర్పే డ్రమ్ముల్లో నీరు, ఇసుకను ఏర్పాటు చేసుకోవాలి.మండపల యందు మరియు శోభాయాత్రలో ఎట్టి పరిస్థితుల్లో డీజే లను ఏర్పాటు చేయరాదు.విద్యాసంస్థలకు, హాస్పిటల్స్ కు, ప్రార్థన మందిరాలకు, వృద్ధులకు, చిన్న పిల్లలకు మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే చిన్న స్పీకర్లను పోలీస్ శాఖ వారి అనుమతితో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలనీ, మండపాల వద్ద భక్తి గీతాలు మాత్రమే ప్లే చేయాలని సూచించారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించుకోవాలని అన్నారు.


గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, జూదం ఆడడం, అసభ్యకరమైన నృత్యాలు ఏర్పాటు చేయడం, ఇతరులను కించపరిచే విధంగా ప్రసంగాలు, పాటలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధం అన్నారు . ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా మండపాల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం పూర్తిగ నిషేధం అని, మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమలు ఏర్పాటు చేసేటప్పుడు పోలీసు వారికి ముందుగానే తెలియపరచాలనీ. ..తద్వారా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండ చర్యలు తీసుకొనుటకు వీలుగా ఉంటుందన్నారు.

ఏదైనా అనుమానాస్పద బ్యాగులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే తక్షణమే డయల్ 100, లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన రోజున నిర్దిష్ట సమయానికి విగ్రహాలను మండపానికి చేరుకునే విధంగా నిర్వాహకులు చూసుకోవాలని డి ఎస్పీ సూచించారు.

సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులు నమ్మకూడదు ఎలాంటి సందేహం ఉన్న సంబంధిత పోలీసు వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలి. మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని మండపాల వద్ద మరియు శోభాయాత్రలో మహిళలకు, పిల్లలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ..

గణేష్ మండపాలో పాయింట్ బుక్స్ ను ఏర్పాటు చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం, రాత్రి సమయాల్లో పోలీస్ శాఖ వారు మండపాలను పర్యవేక్షిస్తారు వారికి సహకరించాలి. పోలీసు వారు సూచించిన పై నియమాలను మరియు నిబంధనలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని అయన పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో రురల్ సిఐ సుధాకర్ ,ఏ ఎసై దేవేందర్ నాయక్ యువజన సంఘాల నాయకులు పొలీసు సిబ్బంది విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు