సీఎం రాకకు ముమ్మర ఏర్పాట్లు-వేములవాడలో వేగంగా సిద్ధమవుతున్న సభాప్రాంగణం
ఉదయం 09.15 గంటలకు జిల్లా పర్యటన మధ్యాహ్నం 01.40 గంటల వరకు
రాజన్న సిరిసిల్ల (సంపత్ panja):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకకు వేములవాడ పట్టణంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ నెల 20 వ తేదీన బుధవారం ఉదయం 09.15 గంటలకు జిల్లా పర్యటన మొదలై, మధ్యాహ్నం 01.40 గంటల వరకు కొనసాగనుంది.
ముందుగా శ్రీ రాజ రాజేశ్వరస్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయంలోని కార్యాలయంలో అభివృద్ది పనులు ఇతర అంశాలపై అధికారులతో చరించనున్నారు.
• అక్కడి నుంచి వేములవాడ గుడి చెరువు ప్రాంగణంలో సభాప్రాంగణం వద్ద పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఈ సందర్బంగా బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు శాఖలవారీగా చేయాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
సోమవారం సాయంత్రం లోగా హెలీప్యాడ్ సిద్ధం చేయాలని ఆర్&బి శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. షామియానా, బారికేడింగ్ చేసి భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. సానిటేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
బహిరంగ సభకు వచ్చే ప్రజల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్లు సమకూర్చాలని, ఒక్కో గ్యాలరీలో మానిటరింగ్ చేసేందుకు ఒక మండలస్థాయి అధికారి ఉంటారని పేర్కొన్నారు. బహిరంగ సభ కోసం బస్సులను సమకూర్చాలని సూచించారు. వీఐపీ, డయాస్, డ్యూటీ, రిసెప్షన్, మీడియా, తదితర పాస్ లను సిద్ధం చేయాలని ఆదేశించారు.
గెస్ట్ హౌస్ లో సదుపాయాలు, శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శన ఏర్పాట్లను, భోజన వసతి, ఇతర అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసే ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.
పోలీస్ శాఖ తరపున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. అంబులెన్స్, బ్లడ్, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేలా చూడాలన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.