# Tags
#తెలంగాణ #లైఫ్‌స్టైల్‌ #హైదరాబాద్

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు,రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ స్కూల్స్ రాంపల్లి కిష్టయ్య (98) మృతి


ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు,రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ స్కూల్స్ రాంపల్లి కిష్టయ్య 98 సం॥నిన్న రాత్రి 11-35 ని॥లకు హైదరాబాద్ లో వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు.

(File Photo: రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై చే సన్మానం…)

వారి అంతిమ సంస్కారం సోమవారం మధ్యాహ్నం మంథని గోదావరి తీరంలో జరుగుతుంది. …

రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర సంతాపం:

ఈ సందర్భంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు రాంపల్లి కిష్టయ్య మృతి పట్ల మంథని శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

అలాగే, న్యాయవాది శశిభూషణ్ కాచే తో పాటుగా పలువురు మంథని ప్రముఖులు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు రాంపల్లి కిష్టయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.