# Tags
#తెలంగాణ

పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి : జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

రాజన్న సిరిసిల్ల జిల్లా: sampath panja

ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్లో విధులు హెడ్ కానిస్టేబుల్ గా నిర్వహిస్తున్నా బి.శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐగా పదోన్నతి పొందినసందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే…

ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ….పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు, పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు,గౌరవ మర్యాదలు లభిస్తాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్.ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.