#తెలంగాణ

విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, స్టడీ మెటీరియల్ అందజేత

చిగురుమామిడి, ఏప్రిల్ 8:

మండలంలోని చిగురు మామిడి, ముల్కనూర్ గ్రామాలలో గల పౌల్ట్రీ ఫార్మ్స్, ఇటుక బట్టీలలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి పని చేస్తున్న 25 మంది విద్యార్థులు చిగురుమామిడి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, ముల్కనూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేరారు.

వీరికి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతి స్కూలు బ్యాగులతోపాటు స్టడీ మెటీరియల్ అందజేయాలని అధికారులకు సూచించారు.

ఈమేరకు స్కూలు బ్యాగులను, స్టడీ మెటీరియల్ ను తహసిల్దార్ ముద్దసాని రమేష్, ఎంపీడీవో బాస మధుసూదన్, మండల విద్యాధికారి శ్రీమతి పావని ఆయా పాఠశాల విద్యార్థులకు మంగళవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్ బడి బయట పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చిగురు మామిడి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రబియా బస్రి, శ్రీమతి శోభా రాణి,ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సుజాత, శ్రీమతి శారద, ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు, సీఆర్పీలు బెజ్జంకి ఆంజనేయులు, చెరుకు శ్రీవాణి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *