#తెలంగాణ

మైనర్ బాలికను వేధించిన పొక్సో కేసులో ఆరుగురు నిందితులకు శిక్ష -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(తెలంగాణ రిపోర్టర్):

మైనర్ బాలికను వేధించిన పొక్సో కేసులో ఆరుగురు నిందితులకు ఏడాది జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 1000 రూ.ల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా జడ్జి ( ఇన్చార్జి పొక్సో కోర్టు) ఎన్. ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు.

2018 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన వేములవాడకు చెందిన బాలికను ఆమె ఇంటి దగ్గరలో వుండే దొమ్మటి ఆనంద్, గొల్లపల్లి శశి, పబ్బ రాజేష్, గౌరవెని నాగరాజు, సయ్యద్ సోహెల్, బొమ్మడి గణేష్ లు తనను లైంగికoగా వేధిస్తున్నారని వేములవాడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అప్పటి పట్టణ సి.ఐవెంకటస్వామి ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

ప్రాసిక్యూషన్ తరపున పి.పి. పెంట శ్రీనివాస్ వాదించగా, CMS ఎస్.ఐ రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్లు నరేందర్, మహేందర్ లు కోర్టులో 8 మంది సాక్షులను ప్రవేశపెట్టారు.కేసు పూర్వాపరాలను పరిశీలించిన సిరిసిల్ల జిల్లా జడ్జి ( ఇన్చార్జి పొక్సో కోర్టు) ఎన్. ప్రేమలత ఆరుగురు నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష, ఒక్కొక్కరికి 1000 రూ.ల జరిమానా విధించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.పైకేసులలో నిందితులకి శిక్ష పడటం లో కృషి చేసిన పీపీ పెంట శ్రీనివాస్,,CMS ఎస్.ఐ రవీంద్రనాయుడు, కోర్ట్ కానిస్టేబుల్ లు నరేందర్, మహేందర్ లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *