# Tags
#తెలంగాణ #జగిత్యాల

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య

  • అధ్యాపకుల ప్రచారం

రాయికల్: S. Shyamsunder

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, విద్యార్థులంతా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని అధ్యాపకులు ప్రచారం నిర్వహించిన సంఘటన ఇది.

జగిత్యాల SKNR డిగ్రీ కళాశాల అధ్యాపకులు గురువారం రాయికల్ మండలం ఇటిక్యాల మోడల్ స్కూల్, రాయికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పర్యటించి విద్యార్థులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని చైతన్యపరిచారు.

ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, ప్రభుత్వ విద్య పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ పి రాజు, ఉపన్యాసకులు సాయి మధుకర్, గోవర్ధన్, కందుకూరి శ్రీనివాస్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.