#హైదరాబాద్ #జగిత్యాల

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య..ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య..

కథలాపూర్ మండలం అంబారిపేట :

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తోందని,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు..బుధవారం ప్రొ. జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామంలోని పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు..జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు..

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి విద్యను అందించాలని విద్యలో అందరూ రాణించాలని ఏ ఒక్కరు కూడా విద్యకు దూరం కావద్దని ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడేలా ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తుందన్నారు.

గత ప్రభుత్వంలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ జరగలేదని ఉమ్మడి రాష్ట్రంలోని టీచర్ నియమ గల జరిగాయని గుర్తు చేశారు.. త్వరలోనే రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు..

అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి శ్రీకారం చుట్టారని అంబర్పేట గ్రామంలోని పాఠశాలలకు సుమారు పదకొండు లక్షలు ఇచ్చామని,1 కోటి రూపాయలపైన కథలాపూర్ మండలానికి ఇచ్చామన్నారు..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా దుస్తుల పంపిణీ తో పాటు పుస్తకాలు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.. అలాగే మధ్యాహ్న భోజనం వసతి కల్పించామన్నారు..

రాష్ట్ర చరిత్రలోనే పాఠశాల ప్రారంభ మొదటి రోజు విద్యార్థులకు యూనిఫామ్స్ పుస్తకాల పంపిణీ చేయడం గొప్ప విషయం అన్నారు.. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.. నోట్స్ ప్రిపేర్ చేసుకొని మంచిగా చదవాలని…విద్యార్థులు ఫోన్లకు టీవీలకు దూరంగా ఉండాలని అన్నారు..

పదవ తరగతి విద్యార్థులు 10/10 సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా ఉండాలన్నారు.. విద్యార్థిని విద్యార్థులకు తన వంతు ప్రోత్సాహం, సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *